స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూన్ 13)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూన్ 13)
  • గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌కు USFDA నుంచి EIR పొందిన సన్‌ఫార్మా
  • తెవా మోటార్స్‌లో వ్యూహాత్మక వాటాను(35.26 శాతం) రూ.90 కోట్లకు కొనుగోలు చేసిన భారత్‌ ఫోర్జ్‌
  • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో షేర్ల కేటాయింపు కోసం ఈనెల 15న సమావేశమై ఇష్యూ ధరను నిర్ణయించనున్న నితిన్‌ స్పిన్నర్స్‌
  • రుచి సోయాను కొనుగోలు చేసేందుకు గరిష్ట బిడ్‌ను దాఖలు చేసిన అదాని విల్మర్‌
  • ఈక్విరస్‌ క్యాపిటల్‌లో 19.98 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించిన ఫెడరల్‌ బ్యాంక్‌
  • జూన్‌ 15 జరిగే బోర్డు మీటింగ్‌లో బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలించనున్న టీసీఎస్‌ బోర్డు
  • ఎంఅండ్‌జీ ప్రుడెన్షియల్‌తో కుదుర్చుకున్న ఒప్పంద విలువను 120 కోట్ల డాలర్లకు పెంచుకున్న టీసీఎస్‌
  • గుజరాత్‌లో సోలార్‌ ఫొటోవోల్టిక్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు కోసం BHELకు రూ.125 కోట్ల ఆర్డరు
  • బైండింగ్‌ బిడ్‌ల దాఖలు గడువును జూన్‌ 14 నుంచి 28కి పొడిగించిన ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌
  • ఎంబైబ్‌ సంస్థలో 73 శాతం వాటా విక్రయ ప్రక్రియను పూర్తి చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌


Most Popular