షార్ట్‌టర్మ్‌ కోసం ఈ ఐదు స్టాక్స్‌ పరిశీలించండి..

షార్ట్‌టర్మ్‌ కోసం ఈ ఐదు స్టాక్స్‌ పరిశీలించండి..

ఒడిదుడుకుల మార్కెట్లో షార్ట్‌టర్మ్‌ కోసం ఈ ఐదు స్టాక్స్‌ కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు. ఈ స్టాక్స్‌ షార్ట్‌టర్మ్‌లో 9-17 రిటర్న్స్‌ ఇచ్చే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు. 

United Breweries: Buy| CMP: Rs 1,275| Stop loss: Rs 1,230| Target: Rs 1,450| Return 13%

ప్రస్తుతం కన్సాలిడేషన్‌ దశలో ఉన్న ఈ స్టాక్‌ను షార్ట్‌టర్మ్‌ కోసం పరిశీలించవచ్చు. లాంగ్‌టర్మ్‌ మంత్లీ ఛార్ట్‌ ప్రకారం ప్రస్తుతం ఈ స్టాక్‌ బుల్లిష్‌గా వుంది. స్ట్రాంగ్‌ మెమొంటమ్‌తో పాటు చక్కని వ్యాల్యూమ్స్‌ నమోదు కావడంతో సోమవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.1,291ని తాకింది. ప్రస్తుతం రూ.1,260 వద్ద ట్రేడవుతోన్న ఈ స్టాక్‌ రూ.1,230 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని మార్కెట్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.1,450.

Maruti Suzuki India: Buy| CMP: Rs 9,022| Stop loss: Rs 8,750| Target: Rs 9,800| Return 8.6%

లాంగ్‌టర్మ్‌ వీక్లీ, మంత్లీ ఛార్ట్‌ ప్రకారం మారుతీ సుజుకీ అప్‌ట్రెండ్‌లో కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.9,996 నుంచి కరెక్షన్‌కు గురైన ఈ స్టాక్‌ ఒకదశలో రూ.8,256కు పడిపోయింది. కరెక్షన్‌ దశకు ప్రస్తుతం బ్రేక్‌ పడినట్టు కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌ రూ.9,350/9,996కు చేరే అవకాశాలున్నాయని మార్కెట్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు. ప్రస్తుత లెవల్స్‌ నుంచి రూ.8,920 వరకు తగ్గినప్పుడల్లా ఈ స్టాక్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.8,750 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేసే ఈ స్టాక్ విలువ రూ.9,800.

RBL Bank: Buy| CMP: Rs 541| Stop loss: Rs 510| Target: Rs 620| Return 14%

గత ఏడాది కాలంలో నెగిటివ్‌గా చలిస్తోన్న ఈ స్టాక్‌ ప్రస్తుతం ఆ దశ నుంచి బయటపడినట్టే కనిపిస్తోంది. వీక్లీ ఛార్ట్స్‌ ప్రకారం హెడ్ అండ్‌ షోల్డర్‌ ప్యాటర్న్‌లో కదలాడుతోన్న ఈ స్టాక్‌ ప్రస్తుతం బ్రేకవుట్‌ దశలో ఉంది. రూ.450-600 మధ్య గత ఏడాది కాలంగా కదలాడుతోన్న ఈ స్టాక్‌  ప్రస్తుత దశలో కొనుగోలుకు అనువైనదని మార్కెట్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు. గత ఐదు సెషన్లుగా సగటు కన్నా అధికంగా వ్యాల్యూమ్స్ నమోదు కావడం పాజిటివ్ మూమెంట్‌కు సంకేతంగా చెప్పొచ్చు. ప్రస్తుత లెవల్స్‌ నుంచి తగ్గినప్పుడల్లా ఈ స్టాక్‌ను రూ.510 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.620. 

Crompton Greaves Consumer Electricals: Buy| CMP: Rs 234| Stop loss: Rs 220| Target Rs 275| Return 17%

ఈ ఏడాది జనవరిలో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.295కు చేరిన ఈ స్టాక్‌ ఆ తర్వాత కరెక్షన్‌కు గురై రూ.217 స్థాయికి పడిపోయింది. గత మూడు నెలలుగా సైడ్‌వే రేంజ్‌లో పయనిస్తోన్న ఈ స్టాక్‌ ప్రస్తుతం కన్సాలిడేషన్‌ దశలో ఉంది. గతంలో లోయర్‌ లెవల్స్‌ నుంచి బౌన్స్‌ బ్యాక్‌ అయిన ఈ స్టాక్‌కు ఈ స్థాయి బలమైన సపోర్ట్‌ జోన్‌గా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సగటు కన్నా అధికంగా వాల్యూమ్స్‌ నమోదు కావడం బుల్లిష్‌ ట్రెండ్‌కు సంకేతంగా కనిపిస్తోందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూ.220 స్టాప్‌లాస్‌తో  కొనుగోలు చేసే ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.275. 

Godrej Industries Limited: Buy| CMP: Rs 617| Stop loss: Rs 585| Target: Rs 700| Return 13%

లాంగ్‌టర్మ్‌ ఛార్ట్స్‌ ప్రకారం అప్‌ట్రెండ్‌లో కనిపిస్తోంది గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌. గత 11 నెలలుగా కరెక్షన్‌ దశలో ఉన్న ఈ స్టాక్‌ ప్రస్తుతం  నెగటివ్‌ నుంచి పక్కకు తప్పుకున్నట్లే కనిపిస్తోంది. 550-512 జోన్‌లో బౌన్స్‌ బ్యాక్‌ అయిన ఈ స్టాక్‌ ఎన్నోసార్లు స్ట్రాంగ్‌ సపోర్ట్‌ జోన్‌గా సంకేతాలిచ్చింది. ప్రస్తుత లెవల్స్‌లో ఈ స్టాక్‌ కొనుగోలుకు అనుకూలమైనదని షార్ట్‌టర్మ్‌లో 13 శాతం రిటర్న్స్‌ ఇచ్చే అవకాశాలున్నాయని మార్కెట్‌ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రూ.585 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ టార్గెట్‌ ధర రూ.700

సూచన : ఈ కథనం ద్వారా పైన చెప్పిన షేర్లను కొనమని కానీ..అమ్మమని కానీ ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ సూచించడం లేదు.. కేవలం ఆ స్టాక్స్ అవగాహన కోసం మాత్రమే కథనాన్ని ప్రచురించాం.Most Popular