రిచ్ స్టాక్సే సేఫ్ బెట్స్! ఎలాగంటారా..?

రిచ్ స్టాక్సే సేఫ్ బెట్స్! ఎలాగంటారా..?

లాభాలు వస్తున్నంత కాలం ఆ స్టాక్ ఎలాంటిది అది ఏ వ్యాపారం చేస్తుంది..వేల్యేషన్స్ ఎలా ఉన్నాయనే విషయం పట్టించుకోం. నష్టాల పాలైతే మాత్రం అన్నీ గుర్తుకువస్తాయ్. మరి రిచ్ వేల్యేషన్స్ ఉన్న షేర్లే ఇప్పుడు పతనం అవుతున్న సమయంలో ఇన్సూరెన్స్ పాలసీల్లాగా కాపాడతాయా అంటే..అవుననే కొన్ని ఉదాహరణలు చూపిస్తున్న్నారు అనలిస్టులు..ఐతే అన్ని కంపెనీలు కాదట.సరిపడినంత ఆదాయం, లాభం వచ్చే అవకాశం ఉన్న షేర్లే ఇలా మిగిలిన కంపెనీలకంటే మంచి పనితీరు కనబరుస్తాయని ఎకనమిక్ టైమ్స్ అనలిస్టులు అంటున్నారు

బజాజ్ ఫిన్ సర్వ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, అవెన్యూ సూపర్ మార్ట్స్, జూబిలంట్ ఫుడ్‌వర్క్స్, కాల్గేట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,హిందుస్తాన్ యూనీలీవర్ వంటి కాలపరీక్షను తట్టుకుని నిలిచిన సూపర్ రిచ్ స్టాక్స్‌ జనవరి నెల నుంచి 22శాతం వరకూ పెరగడం గమనార్హం.2019 ఆర్ధికసంవత్సరం ఆదాయల అంచనాలను చూస్తే బ్రిటానియా, అవెన్యూ(డిమార్ట్), జూబిలంట్ ఫుడ్ వర్క్స్ 50రెట్లు అధిక వేల్యేషన్స్‌తో ప్రస్తుతం ట్రేడవుతున్నాయ్. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బుక్ వేల్యూ కంటే మూడున్నరరెట్లు అధికంగా ట్రేడవుతున్నాయ్. వీటిపై రాబడి చూస్తే పీఈ రేషియో పరంగా చాలా ఎక్కువే నమోదు అవుతుంది. ఐతే ఇలాంటి స్టాక్స్ ‌పిఈ (ప్రైస్ ఎర్నింగ్ రేషియో) ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్నే దృష్టిలో పెట్టుకుని వీటిలోంచి పెట్టుబడి బైటికీ తీయడం సమంజసం కాదంటారు. వరసగా వేల్యేషన్స్ పెరుగుతూ పోవడానికి కారణం, వీటి ఆదాయం కూడా పెరుగుతూ పోతుండటంతో మదుపరులు పెట్టుబడులు కొనసాగించడమే అంటారు. భారీ రాబడి అంచనాలు వీటిలో నమ్మకానికి నిదర్శనంగా చెప్పొచ్చు. అలానే ఇదే సమయంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీ 10శాతం నష్టపోవడం చూడాలి. కానీ కాల్గేట్ పామోలివ్, వరుణ్ బెవరేజెస్,జ్యోతి ల్యాబ్స్ షేరు ధర 10-16శాతం పెరిగాయి.

ఈ కంపెనీల్లో ఆదాయవృధ్ది ఎందుకు సాధ్యమంటే..లాభాల్లో 20శాతం వృధ్ది అంచనా వేస్తున్నారు కాబట్టి..అది కూడా ఉత్పాదక సామర్ధ్యం పెంచే వ్యూహాలు ఉన్నాయి కాబట్టి. సేమ్ స్టోర్ గ్రోత్( ఒకే షాపులో అమ్మకాల వృధ్ది) అవెన్యూ సూపర్ మార్ట్‌లో పెరుగుతోంది. అంటే డి మార్ట్ కొత్త మాల్ ప్రారంభించిన ప్రతిసారీ ఈ లాభాలు పెరుగుతున్నాయన్నమాట. 2012లో 55 స్టోర్లున్న డి మార్ట్ ఇప్పుడు 115కి ఆ సంఖ్యని పెంచింది. మరి ఆదాయం, లాభంపెరగకుండా ఉంటాయా..? ప్రతి చదరపు అడుగుకీ లాభం 15వేల రూపాయల నుంచి 33వేల రూపాయలకి డిమార్ట్ పెంచుకుంది. ఇదే రేంజ్ రానున్న రెండేళ్లూ డిమార్ట్ కొనసాగిస్తుందని బ్లూమ్ బర్గ్ లెక్కలు అంచనా వేస్తున్నాయ్. 27 నుంచి 30 స్టోర్లు కొత్తగా అవెన్యూ సూపర్ మార్ట్ ప్రారంభించనుంది.అందుకే ఇప్పుడు వచ్చే ఆర్ధికసంవత్సరం ఆదాయంతో పోల్చితే 92రెట్లు అధిక వేల్యేషన్స్‌లో డిమార్ట్ ట్రేడవుతోంది.
అంతే కాకుండా ఈ కంపెనీలు తమ ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు, తద్వారా లాభం కూడా పెంచుకుంటున్నాయి. వీటిలో మార్జిన్లు ఎక్కువ కాబట్టి ఆ మేరకు షేరు ధరల్లో కూడా హేతుబద్దత చేకూరుతుందనే వాదన ఉంది. ఇలా ఈ సంస్థల వేల్యేషన్స్ ఎంత రిచ్‌గా ఉన్నా, డౌన్‌సైడ్ కంఫర్ట్(దిగువ స్థాయిలో సౌకర్యవంతమైన రేటు) చేకూరిందని అభిప్రాయపడుతున్నారు

 

 Most Popular