జల్లెడ పట్టాం మీకోసమే : 20ఏళ్ల నుంచి ఏటా 50% లాభం పంచుతున్నాయ్

జల్లెడ పట్టాం మీకోసమే : 20ఏళ్ల నుంచి ఏటా 50% లాభం పంచుతున్నాయ్

స్మాల్‌క్యాప్ మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి చేతులు కాలాయని బాధపడుతున్న కొంతమందిని చూసి ఉంటాం. ఐతే ఈ సమయంలో సెన్సెక్స్, నిఫ్టీనే చూస్తే గరిష్టస్థాయి నుంచి పతనమైంది కేవలం 4శాతమే.

ఎప్పుడు మార్కెట్లలో భారీగా పతనం చోటు చేసుకుంటుందో..అప్పుడు ఎక్కువమంది తమ పొజిషన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు లాభాలొస్తున్నాయో అప్పుడు ప్రెష్‌గా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటారు..కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల నుంచి ఆటుపోటులు తట్టుకుంటూ లాభాలు పంచుతున్న స్టాక్స్ కొన్ని ఉన్నాయ్. వీటిని రెండు దశాబ్దాలుగా విడదీసి చూసినప్పుడు
కొన్ని మొదటి భాగంలో అంటే 1998-2008 వరకూ బాగా లాభం పంచితే, కొన్నేమో 2008-2018 వరకూ మంచి రిటర్న్స్ ఇచ్చాయి.ఇలాంటి జల్లెడ వాడినప్పుడు 18 కంపెనీలు పైకి తేలాయి. వాటిలో ఐషర్ మోటర్స్, శ్రీ సిమెంట్స్, వినతి ఆర్గానిక్స్ వంటి స్టార్ పెర్ఫామర్స్ కూడా ఉండటం అన్నింటికంటే గొప్ప విశేషం.

కింద ఒక పట్టిక(టేబుల్) ఇచ్చాం చూడండి..దాని ప్రకారం ఎవరైనా ఓ పదివేల రూపాయలు పెట్టుబడి కనుక ఏ ఐషర్ మోటర్స్, మదర్సన్ సుమినో, వినతి ఆర్గానిక్స్‌లోనో పెట్టి ఉంటే..కోటీశ్వరులై ఉండేవాళ్లు..అదీ ఈక్విటీల పవర్..!

( పైన చూపబడిన నంబర్లు షేర్లు పెరిగిన శాతం)

ఈ షేర్ల ప్రగతి, పంచిన లాభం చూసినప్పుడు అసలు ఇవి నష్టపోలేదా..ఎప్పుడూ పతనం అవ్వలేదా అంటే..ఎందుకు లేదు..ఆ సందర్భాలు ఈ పది ఇరవైఏళ్లలో ఎన్నోసార్లు జరిగి ఉండొచ్చు..కానీ పెట్టుబడి దీర్ఘకాలం కొనసాగిస్తే వచ్చిన లాభం అది..వీటిలో తాత్కాలికంగా నష్టాలు వచ్చినా, వాటిని పూడ్చుకున్న తీరుని గమనించాలి..సమర్ధవంతమైన స్టాక్స్‌ కాలం కొట్టే దెబ్బలను కాచుకుంటాయ్. తిరిగి తలెత్తి గర్వంగా నిలబడతాయ్. అందుకే మంచి కంపెనీలనే ఎంచుకోమని పదే పదే అనలిస్టులు సూచిస్తుంటారు.

(ఈ కథనం ద్వారా  పైన చెప్పిన షేర్లను కొనమని కానీ..అమ్మమని కానీ ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్ సూచించడం లేదు..కేవలం ఆ స్టాక్స్ పెర్ఫామెన్స్‌పై ఓ విశ్లేషణ మాత్రమే)Most Popular