ఆడుతూ పాడుతూ తెగ సంపాదిస్తున్నాడు గురూ

ఆడుతూ పాడుతూ తెగ సంపాదిస్తున్నాడు గురూ

ఫోర్బ్స్ ప్లేయర్స్ లిస్ట్‌లో చోటు సంపాదించడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఏడాది అధిక ఆదాయం ఆర్జించినవారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు.  ఒక్క సంవత్సరంలోనే 161కోట్లు ఆర్జించడం ద్వారా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచాడు

కంపెనీల ఉత్పత్తుల అమ్మకాల్లో బ్రాండింగ్‌కి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలా తన అండార్స్‌మెంట్ల ద్వారా టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ 2018లో 24 మిలియన్ డాలర్లు ఆర్జించడం విశేషం.  ఈ ఘనతతోనే ఫోర్బ్స్ ఏటా విడుదల చేసే అధిక ఆదాయార్జన  క్రీడాకారుల జాబితాలో 89వస్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ ప్లేయర్ కోహ్లీనే. క్రికెట్ మ్యాచ్ ఫీజుల రూపంలో 27కోట్లు మాత్రమే సంపాదించగా..ప్రచారకర్తగా 133కోట్లు ఆర్జించడం విశేషం. అంటే బ్రాండింగ్ తో వచ్చిన ఆదాయాన్ని లెక్క వేస్తే ఫోర్బ్స్ జాబితాలో 15వ ర్యాంక్‌లో నిలుచుండటం విశేషం.ఐతే ఈ లిస్టులో బాస్కెట్ బాల్ ప్లేయర్లు ఏకంగా 40మంది ఉన్నారు. ఇక ఆదాయపరంగా నంబర్ వన్ క్రీడాకారుడిగా 285 మిలియన్ డాలర్లతో అమెరికాకి చెందిన బాక్సర్ ఫ్లాయిడ్ మేవేదర్.., ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ 111 మిలియన్ డాలర్లతో రెండో స్థానం..రొనాల్డో 108 మిలియన్ డాలర్లతో మూడో స్థానం సాధించారుMost Popular