పాలసీ రేట్లు పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌

పాలసీ రేట్లు పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌

మూడు రోజులపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపునకే మొగ్గు చూపింది. ముడిచమురు ధరల పెరుగుదల, సీపీఐ బలపడుతుండటం వంటి ప్రతికూల అంశాల నడుమ రెపో, రివర్స్‌ రెపో రేట్లను పావు శాతంమేర పెంచింది. కాగా.. అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు ప్రస్తుతం యథాతథ పాలసీ అమలును అంచనా వేయగా.. ఆగస్ట్‌ పాలసీ సమీక్షలో రేట్ల పెంపు ఉండవచ్చని అభిప్రాయపడటం గమనించదగ్గ అంశం.

రెపో రేటు 0.25 శాతం పెంపు
వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 6 శాతం నుంచి 6.25 శాతానికి పెంపు
మరోవైపు రివర్స్‌ రెపోను సైతం పావు శాతం పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌
వెరసి రివర్స్‌ రెపో 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంపు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి సీపీఐ టార్గెట్‌ 4.8-4.9 శాతం
వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం- సీపీఐ
ఏప్రిల్‌- సెప్టెంబర్‌ కాలానికి జీడీపీ 7.5-7.6 శాతం వృద్ధి అంచనా
దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా ఇది!
బ్యాంకులు స్వల్పకాలానికి రిజర్వ్ బ్యాంక్‌ వద్ద డిపాజిట్‌ చేసే నిధులకు అందుకునే వడ్డీ రివర్స్‌ రెపోMost Popular