ఇది చదివితే ఇక జన్మలో ఫేస్‌బుక్‌లో ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వరు

ఇది చదివితే ఇక జన్మలో ఫేస్‌బుక్‌లో ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వరు

డేటా..అంటే సమాచారం..ఎంతో ముఖ్యమైన పదం ఇది. వ్యక్తిగతానికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా గోప్యంగా ఉంచాల్సిందే  కానీ నో యువర్ కస్టమర్ పేరుతోనో..టెర్రరిస్ట్ ముప్పునుంచి తప్పించేందుకు అనో..రకరకాల కారణాలతో మన వివరాలు ఎక్కడో అక్కడ పొందుపరచాల్సి ఉంది కానీ స్మార్ట్  ఫోన్ల యుగంలో ఇప్పుడు డేటా లీకేజీ అనేది సర్వసామాన్యంగా మారింది. ఇది ఒక్క భారత్ దేశానికే పరిమితం కాదు. ఫేస్ బుక్ , ట్విట్టర్ లాంటి సామాజికవేదికలు వాడుతున్న ప్రతి ఒక్కరి డేటా ఇప్పుడు ప్రమాదంలో పడింది.

డేటా లీకేజీ చేస్తున్నారంటూ ఫేస్‌బుక్ పై ఆరోపణలు వచ్చిన సమయంలో స్వయంగా మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఐతే అది అంతటితో ఆగలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఎందుకంటే అడ్డగోలుగా ఏ యాప్ అంటే ఆ యాప్‌ని ఫోన్లలోకి దింపేసుకుంటున్నా ఏదో చిన్న కాలక్షేపం కోసం వాడుకోవాల్సిన పరికరాలను ప్రతి వ్యక్తిగత అవసరానికి ముడిపెట్టుకుంటూ ప్రమాదంలోకి నెట్టబడుతున్నాం.ఇది ఎంత ప్రమాదకరమైనదో చెప్తూ ఈ మధ్యనే హీరో విశాల్ అభిమన్యుడు అనే సినిమా ఒకటి చేశాడు. ఇది సినిమానే అని తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫేస్ బుక్ తన యూజర్ల డీటైల్స్ ఆపిల్, శాంసంగ్ సహా మరో 60కి పైగా మొబైల్ కంపెనీ తయారీదార్లకి అందించేలా ఒప్పందం కుదుర్చుకుందనే నిజం వెల్లడైంది. అంటే ఈ ఫోన్లు వాడేవాళ్లందరి డీటైల్స్ ప్రీగా అమ్మకానికి ఉన్నట్లే అనుకోవచ్చు

ఆపిల్, అమెజాన్, బ్లాక్‌బెర్రీ, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఈ నాలుగు కంపెనీలు ఫేస్‌బుక్ ఆవిర్భవించకముందునుంచీ ఉన్నాయ్.తమ ఫోన్ల అమ్మకాల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు జత చేసే ఈ కంపెనీలు తమ హ్యాండ్ సెట్లలో ఫేస్ బుక్ ఫీచర్ , ఆ తర్వాత యాప్స్ రెడీమేడ్‌గా దొరికే సదుపాయాలు కల్పించేవి. ఇదే దారిలో ఆ తర్వాత ఫోన్ తయారీ కంపెనీలూ నడవడంతో..ఇక వినియోగదారుల వివరాలు చాలా సులభంగా ఈ కంపెనీలకు ఫేస్ బుక్ నుంచి అందేవి..ఇదే విషయం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఈ మధ్యనే క్షమించరాని తప్పు చేశానని స్వయంగా జుకర్ బర్గ్ ప్రకటించిన తర్వాత  కూడా ఈ డేటా షేరింగ్ జరుగుతుండటం అసలు విషాదం. కేంబ్రిడ్జి అనలిటికాతో ఒప్పందం పెట్టుకుని ఓటర్ల వివరాలు తెప్పించుకున్నారని దేశాధినేతలపైనే అరోపణలు వచ్చాయ్. మార్చి నెలలో దీనిపైన పెద్ద రగడే చోటు చేసుకుంది. ఐతే 2014 తర్వాత తాము ఇలాంటి పనులు ఆపేశామని పేస్‌బుక్ యాజమాన్యం బుకాయించింది. ఐతే ఇలా హ్యాండ్ సెట్ మేకర్లతో ఒప్పందాలపై మాత్రం బహిరంగంగా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ విషయం బైటపడటంతో ఏమని సమర్ధించుకుంటుందో చూడాలి..ప్రాథమికంగా మాత్రం మేమిచ్చినా ఇవ్వకపోయినా వాళ్లెటూ ఆ డేటా సంపాదించగలరు అని చెప్పడం మాత్రం హాస్యాస్పదమే. ఇది డోర్ లాక్ తయారు చేసినవాడు ఓనర్‌తో పాటు అడిగిన అందరికీ తాళం చెవులు ఇవ్వడమే అని అష్కాన్ సోల్టానీ అనే ప్రవేట్ కన్సల్టెంట్ అభిప్రాయపడ్డాడు.

ఇది మొబైల్ కంపెనీల ఒప్పందం విషయమైతే.. ఫేస్ బుక్‌లో ఫోన్ నంబర్ ఇస్తే చాలు అది వాడేవాళ్ల పేరు, అడ్రస్ ఫోటోలు అన్నీ దొంగిలించవచ్చని ప్రూవ్ అయింది. సాల్ట్ డాట్ ఏజెన్సీ టెక్నికల్ డెవలపర్ అయినటువంటి రెజా మెయావుద్దీన్ అనే వ్యక్తి ఇలా కొన్ని లక్షల అక్కౌంట్ల తాలుకూ డేటా దొరికిందంటూ చెప్పి సంచలనం కలిగించాడు. ఈ విషయంపై ఫేస్ బుక్ కి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని మనోడు ఆరోపించాడు. మరోవైపు ఫేస్ బుక్  మాత్రం ప్రొఫైల్స్ దొరికినంత మాత్రాన ఏమీ కాదని వాళ్ల ప్రొపైల్స్ లోకి వెళ్లి కామెంట్లు చేయడం వంటి అనుచిత చర్యలు కుదరవని బుకాయించింది. ఫోన్ నంబర్ ప్రొఫైల్ ఐడి ఉంటే..ఇక పాస్ వర్డ్ బ్రేక్ చేయడం ఎంత సేపు..ఆ విషయం ఇప్పటికే అనేక క్రెడిట్ కార్డుల మోసాల విషయంలో బైటపడింది కూడా ఇన్ని లక్షలమంది ఫోన్ నంబర్లతో ఫేస్ బుక్ అనుసంధానం చేసుకున్న తర్వాత ఇప్పుడు తీరిగ్గా ఫోన్ నంబర్లు ఇవ్వకపోవడమే మంచిదని చెప్పడం దారుణం. అందుకే ఫేస్‌బుక్కే కాదు ఎక్కడ ఎవరు అడిగినా మన వివరాలు వీలైనంత తక్కువే ఇవ్వాలి.Most Popular