వాయ్యా...ఈ కంపెనీలు డీలిస్ట్ చేస్తే మన గతేం కానూ..!

వాయ్యా...ఈ కంపెనీలు డీలిస్ట్ చేస్తే మన గతేం కానూ..!

నష్టమో..లాభమో..చిన్న చితకా షేర్లు కొన్నికొనుక్కుని ఎప్పటికైనా పెరుగుతాయని పోగేసుకుంటాం కొన్నిటిలో లాభం తెచ్చుకుంటాం కూడా..ఐతే ఇలాంటివాటిలో కొన్ని కంపెనీలు ఎన్‌సిఎల్‌టి వద్ద
దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్నవీ ఉన్నాయ్. ఇప్పుడు సెబీ వాటికి షాక్ ఇచ్చే ఓ ప్రతిపాదనముందుకు తెచ్చింది. దివాలాకి దగ్గరగా ఉన్న ఈ కంపెనీలను డీలిస్ట్ చేయాలంటూ కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(CIRP) చట్టానికి
టేకోవర్ కోడ్‌తో సవణర చేయనుంది. ఇది తక్షణం ఈ షేర్లలో పెట్టుబడి పెట్టినవారికి ఆందోళన కలిగించే పరిణామం. భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్, జేపీ అసోసియేట్స్, జేపీ ఇన్ఫ్రా, రుచిసోయా, ఆర్.కామ్, వీడియోకాన్ వంటి కంపెనీలు ఈ ప్రతిపాదనతో డీలిస్ట్ అయితే రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతారు. ఐతే అంతిమంగా మదుపరుల ప్రయోజనాలు, సంపద కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ చెప్తోంది

ఐతే ఇలా డీలిస్ట్ చేయడానికి రెండు షరతులు(కండిషన్స్) చెప్పింది సెబీ. అందులో ఒకటి, నష్టాలనుంచి గట్టెక్కేందుకు అనుసరించే ప్రణాళికలో ఒక నిర్దేశించిన పద్దతి ప్రకారం చేయడం.రెండో షరతు..కంపెనీలో  ఉన్న వాటాదారులకు కంపెనీ నుంచి వైదొలగే అవకాశం కలిగించే పద్దతి. ఇందులో ప్రతి షేరుహోల్డర్‌కి తన వాటాకి ఏదోక రేటు వద్ద విక్రయించుకునే అవకాశం కలిగిస్తారు

 త్వరగా కంపెనీ భవిష్యత్తు తేలడానికే  ఎన్‌సిఎల్‌టి వద్ద ఇప్పుడు అనేక సంస్థలు క్యూ కట్టాయి. దీంతో ఎన్‌పిఏలు పోగా, మిగిలిన వ్యవస్థ ప్రకారం కంపెనీలు తమ వ్యాపారం చేసుకోవడానికి వీలు ఉంటుంది. సెబీ ప్రతిపాదించిన ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే సెబీ తీసుకోవాలనుకుంటున్న ఈ నిర్ణయం నుంచి ఎన్‌సిఎల్‌టివద్ద కేసులు తేలి ఫలితం వచ్చే కంపెనీలను మినహాయించాలని డిమాండ్ విన్పిస్తోంది. ఎందుకంటే షేర్ హోల్డర్లు చాలామంది తమ సంపద అనవసరంగా కోల్పోవాల్సి వస్తుందని వారి వాదన

 Most Popular