చిన్న షేర్లు చితికిపోతున్నాయ్..!

చిన్న షేర్లు చితికిపోతున్నాయ్..!

ఈ ఏడాది చిన్న షేర్లు చితికిపోతున్నాయి. 2018 తొలి 5 నెలల్లో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో 67 స్టాక్స్‌ విలువ సగానికి సగం పడిపోయింది. ఈ క్యాలెండర్‌ ఇయర్లో స్మాల్‌ క్యాప్‌ సూచీ 15 శాతం పైగా క్షీణించగా.. మిడ్‌క్యాప్ ఇండెక్స్‌ 12 శాతం నష్టపోయింది. గత నాలుగేళ్ళుగా (జనవరి 2014 నుంచి డిసెంబర్‌ 2017 వరకు) స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 193 శాతం, మిడ్‌క్యాప్ 166 శాతం లాభపడగా.. సెన్సెక్స్‌ మాత్రం 61 శాతం లాభపడింది. 

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లోని 859 స్టాక్స్‌లో 577 స్టాక్స్‌ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇందులో 67 స్టాక్స్‌ విలువ 50 శాతం పైగా క్షీణించింది. గీతాంజలి జెమ్స్‌, బాంబే రేయాన్‌, డైమండ్‌ పవర్‌, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రా, ఐవీఆర్‌సీఎల్‌, పీసీ జ్యువెలర్స్‌, రిలయన్స్‌ నావల్‌, కేఎస్‌కే ఎనర్జీలు 70-90 శాతం నష్టపోయాయి. అలాగే ఆడిటర్ల రాజీనామాతో వారం రోజుల వ్యవధిలోనే అట్లాంటా 61 శాతం, మన్‌పసంద్‌ 58 శాతం క్షీణించాయి. Most Popular