షార్ట్‌టర్మ్‌ కోసం ఈ స్టాక్స్‌ పరిశీలించండి..

షార్ట్‌టర్మ్‌ కోసం ఈ స్టాక్స్‌ పరిశీలించండి..

గడచిన వారం నిఫ్టీ పాజిటివ్‌గా ముగిసినప్పటికీ కీలక స్థాయి 10700 దిగువన క్లోజైంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాల నిర్ణయాలు ఈవారం ఉండటంతో మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు రెండు లెవల్స్‌ను అప్‌సైడ్‌లో 10,770, డౌన్‌ సైడ్‌లో 10,550 స్థాయిలను జాగ్రత్తగా గమనించాలి. నిఫ్టీ 10770 మార్కును దాటితే 10820-10900 లెవెల్స్‌కు చేరే అవకాశముందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రాజేశ్‌ పల్వియా అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ నిఫ్టీ 10640 లెవల్స్‌లో బ్రేక్‌ అయితే 10,550-10500కు పడిపోయే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేస్తే వచ్చే 1-2 నెలల్లో 3-14 శాతం రిటర్స్‌ అందుకోవచ్చని పలువురు ఎనలిస్ట్‌లు రికమండ్‌ చేస్తున్నారు. 

Ujjivan Financial Services Limited: Buy | Target: Rs 450 | Stop loss: Rs 365 | Return 14%
జూన్‌ 1న ఈ స్టాక్‌ రూ.393.80న క్లోజైంది. 52 వారాల కనిష్ట స్థాయి (04-08-2017) రూ.285 కాగా.. ఏడాది గరిష్ట స్థాయి (11-05-2018) రూ.434.75. గత 20 రోజులుగా ఈ స్టాక్‌ 10శాతం పైగా కరెక్షన్‌కు గురైంది. ఈ సమయంలో షార్ట్‌టర్మ్‌, మీడియం టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ కోసం ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఎస్‌ఎంసీ గ్లోబల్‌ రికమండ్‌ చేస్తోంది. రూ.385-389 రేంజ్‌లో కొనుగోలు చేయాలి. ఈ స్టాక్‌ టార్గెట్‌ రూ.440-450. 

Pfizer: Buy| LTP: Rs 2,565| Target: Rs 2,855| Stop loss: Rs 2,405| Return 11%
గత కొన్ని సెషన్లుగా అన్ని ఫార్మా స్టాక్స్‌ చక్కని రిటర్న్స్‌ను అందిస్తున్నాయి. డైలీ ఛార్ట్స్‌ ప్రకారం చూస్తే ఫైజర్‌.. 20-DEMA రాబోయే సెషన్స్‌లో స్ట్రాంగ్‌ ట్రెండ్‌ను సూచిస్తోందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ తెలిపింది. ప్రస్తుత లెవల్స్‌లో ఫైజర్‌ను కొనుగోలు చేస్తే వచ్చే నెల రోజుల్లో ఈ స్టాక్‌ 10శాతం పైగా రిటర్న్స్‌ను అందించే అవకాశముంది. స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.2,855

KPIT Technologies Ltd: Buy| LTP: Rs 285.75| Target: Rs 319| Stop loss: Rs 266| Return 11.6%
వీక్లీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే 10-DEMA & 50-DEMA ఎగువన ఈ స్టాక్‌ ట్రేడవుతోంది. కేపీఐటీ టెక్నాలజీస్‌ ప్ర్రస్తుతం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి సమీపంలో వుంది. ఇటీవల మార్కెట్లు డౌన్‌సైడ్‌లో ఉన్నప్పటికీ ఈ స్టాక్‌ ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ తెలిపింది. ఈ స్టాక్‌ను వచ్చే నెల రోజుల కోసం కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.319

Dabur Ltd: Buy| LTP: Rs 386.75| Target: Rs 427| Stop loss: Rs 364| Return 10.4%
వరుసగా రెండో ఏడాది కూడా డాబర్‌ లిమిటెడ్‌ చక్కని రిటర్న్స్‌ అందిస్తోంది. ప్రస్తుతం 10-DEMA ఎగువన ఈ ట్రేడ్‌ అవుతుండడంతో ఇది బుల్‌ కౌంటర్‌ను సూచిస్తోంది. ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి సమీపంలో ఈ స్టాక్‌ కదలాడుతోంది. మార్కెట్‌ ఒడిదుడుకులను తట్టుకుని గత కొంతకాలంగా ఈ స్టాక్‌ చక్కని ప్రదర్శనను నమోదు చేస్తోంది. ఈ స్టాక్‌ను కరెంట్‌ లెవెల్స్‌లో కొనుగోలు చేయమని ఏంజెల్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది. వచ్చే నెల రోజుల్లో ఈ షేర్‌ టార్గెట్‌ ధర రూ.427.

HCL Technologies: Buy| Target: Rs 997| Stop loss: Rs 885| LTP: 906.40| Return 10%

ప్రస్తుతం కన్సాలిడేషన్‌ మోడ్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ట్రేడవుతోంది. ఏప్రిల్‌లో నమోదైన గరిష్ట స్థాయి రూ.1,108 నుంచి గత కొంతకాలంగా ఈ స్టాక్‌ డౌన్‌సైడ్‌లో పయనిస్తోంది. ఈ స్టాక్‌ ప్రస్తుతం రూ.900 సమీపంలో ట్రేడవుతోంది. ఈ స్టాక్‌ వచ్చే నెలరోజుల్లో రూ.997కి చేరే అవకాశాలున్నాయని ఛార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌, ట్రేడింగ్‌ అడ్వైజర్‌ మజహర్‌ మొహమ్మద్‌ అంచనా వేస్తున్నారు. 

Torrent Pharma Ltd: CMP: Rs 1,438| Buying Range: Rs 1,430-1,400| Target: Rs 1540| Stop loss Rs 1375| Return 7%

గత కొన్ని రోజులుగా హై వాల్యూమ్స్‌ నమోదు అవుతుండడంతో ఈ స్టాక్స్‌లో మళ్ళీ జోష్‌ వచ్చే అవకాశాలున్నాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రాజేశ్‌ పల్వియా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌(ఎస్‌ఎంఏ) 20, 50, 100 ఎగువన ట్రేడవుతోంది. వచ్చే నెల రోజుల్లో ఈ స్టాక్‌ 7శాతం రిటర్న్స్‌ను అందించే అవకాశముంది.Most Popular