వరదలొచ్చినా..పిడుగులు పడ్డా ఈ షేర్లని మాత్రం ఎఫ్ఐఐలు వదలడం లేదు

వరదలొచ్చినా..పిడుగులు పడ్డా ఈ షేర్లని మాత్రం ఎఫ్ఐఐలు వదలడం లేదు

2018లో ఇప్పటిదాకా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కానీ, పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు కానీ..తమ పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారే తప్ప కొత్తగా ఇన్వెస్ట్ చేయడం తక్కువైపోయింది. కానీ..కొన్ని షేర్లలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ
ఒక్కశాతం వాటా కూడా వెనక్కి తీసుకోవడం లేదు. గత 40 క్వార్టర్లు..అంటే పదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే..అలా వారి నమ్మకాన్నిచూరగొన్న స్టాక్స్ ఇప్పుడు చూద్దాం..అవేంటో తెలుసా..ఎస్..మీ ఊహ సరైనదే..హౌసింగ్ డెవలప్‌మెంట్ పైనాన్స్ కార్పొరేషన్-HDFC వాటిలో ఒకటి. ఎఫ్ఐఐలకు 74శాతం వాటా ఈ కంపెనీలో ఉంది. ఈ పదేళ్లలో ఈ షేరు 275శాతం పెరిగింది. ఋణాలను ఇవ్వడంలో మంచి వృధ్ది నమోదు చేస్తోన్న హెచ్‌డిఎఫ్‌సికి రిలయన్స్ సెక్యూరిటీస్ రూ.2372 ధరతో కొనమని సూచిస్తోంది.

ఇక ముందు చెప్పుకున్నట్లు దీర్ఘకాలంగా ఎఫ్ఐఐల మద్దతు లభిస్తోన్న షేర్ల విషయానికి వస్తే, అవి హెచ్‌డిఎప్‌సి బ్యాంక్, ఇండస్ఇఁడ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్, సిటియూనియన్ బ్యాంక్ ఉన్నాయ్. అంటే అన్నీ ఒకే రంగానికి చెందినవి కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి. గత పదేళ్ల కాలానికి ఫారిన్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్ల(విదేశీ సంస్థాగత మదుపరుల) ఫేవరిట్లుగా మారిన ఆ షేర్లని కింది టేబుల్‌లో చూడండి

మరి వీటిలో ఏది బెస్ట్ అని చెప్పమంటారో అని అడిగినప్పుడు వెంచురా సెక్యూరిటీస్ కి చెందిన వినీత్ బోలింజర్‌ని అడిగినప్పుడు ఆయన ఓటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి వేశారు. దీనికి కారణం, ఆ సంస్థ బ్యాలెన్స్ షీట్ సమర్ధతే కారణమని చెప్తారు.ఎఫ్ఐఐలు ఇప్పటికి ఈ ఏడాదిలో వెనక్కి తీసుకున్నది రూ.640 కోట్లైతే, దేశీయ మదుపరులు రూ.48వేలకోట్లు. అంటే మన సొంత సత్తానే ఇప్పుడు మార్కెట్లలో పెట్టుబడులుగా ఉన్నాయన్నమాట. ఇది మార్కెట్లకు సానుకూల సంకేతమేMost Popular