మీ సొమ్మును మదుపు చేసుకునేందుకు 5 చక్కటి మార్గాలు..

మీ సొమ్మును మదుపు చేసుకునేందుకు 5 చక్కటి మార్గాలు..

సంపాదించిన సొమ్మును వివిధ పద్ధతుల్లో మదుపు చేయడం ద్వారా భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థిక అవసరాలకు తగినంత సొమ్మును వెనకేసుకోవచ్చు. ఇన్వెస్ట్ మెంట్ ప్లానింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనలిస్టుల సలహాలతో పాటు స్వతహాగా అధ్యయనం చేయడం ద్వారా మంచి పథకాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. 

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు : 
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాలా ఆకర్షణీయమైన మదుపు చర్య, ఎందుకంటే ఈ తరహా పెట్టుబడులకు తప్పని సరిగా రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ అనేది దాదాపు ఉండని పరిస్థితి, ఫిక్స్ డ్ డిపాజిట్లను సాధారణంగా ఒక సంవత్సరం వరకూ పెట్టుకునే అవకాశం ఉంది. అంతే కాదు మెచ్యురిటీ తీరక మునుపే విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అయితే ఇందులో టాక్స్ సేవింగ్ మాత్రం చేయడం సాధ్యం కాదు.

మ్యూచువల్ ఫండ్స్ : 
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్ పథకాల్లో మంచి రిటర్న్స్ లభించే అవకాశం ఉంది. అలాగే సిప్ ద్వారా సైతం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టాక్స్ సేవింగ్ ఉపలబ్ది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లభిస్తుంది. ప్రధానంగా మనం ఎంపిక చేసుకున్న ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మదుపు చేసుకుంటే భవిష్యత్ లో అవసరాలకు కావాల్సిన సొమ్ము అందుబాటులోకి వస్తుంది. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ : 
ఈ తరహా మదుపును పీపీఎఫ్ అంటారు. ఇది ఒక సెక్యూర్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ పథకం, దీని ద్వారా పూర్తిస్థాయిలో పన్ను రహిత పెట్టుబడి, సుమారు 10 నుంచి 15 సంవత్సరాల పాటు మదుపుచేసుకునే అవకాశం లభిస్తుంది. కనీసం 5 సంవత్సరాల పాటు ఈ పెట్టుబడులను ప్రోత్సహించినట్లయితే, ఆరో సంవత్సరం మీ పెట్టుబడులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పీపీఎఫ్ లపై 7.6 శాతం సాలీనా వడ్డీ కింద లభించే అవకాశం ఉంది. 

కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు : 
బ్యాంకుల తరహాలోనే ఇవి కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. అయితే ఇవి నాన్ బ్యాంకింగ్ సెక్టారుకు చెందినవి. మనం డిపాజిట్ చేసిన మొత్తాన్ని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి రిటర్నులను మనకు అందచేస్తారు. ఈ కంపెనీ ఎఫ్ డీలు కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 58 ఏ కిందకు వస్తాయి. అయితే ఈ తరహా ఎఫ్డీల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మదుపు చేసే ముందు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ను పూర్తిగా చదివిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కోసారి మధ్యలోనే విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోతే చాలా రిస్క్ ను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. 

గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ : 
సాంప్రదాయ పద్ధతులతో పాటు ఇప్పుడు బంగారాన్ని డిజిటల్ రూపంలోనూ, లేదా ఈటీఎఫ్ పథకాల్లోనూ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, లేదా ఫిజికల్ గానూ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. అయితే బంగారం పెట్టుబడుల్లో నష్టం తక్కువగా ఉంటుంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ పథకాలు ప్రస్తుతం మార్కెట్లో సేఫెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ గా పేరుగాంచాయి. 
 Most Popular