గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీవో బాట!

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీవో బాట!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యుద్ధనౌకలను తయారు చేసే గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీవోకు మే నెలాఖరున సెబీ అనుమతించింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం 17.5 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు 2 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తద్వారా ప్రభుత్వం రూ. 1,000-1200 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. 
కంపెనీ వివరాలివీ
1934లో ఏర్పాటైన కంపెనీని 1960లో కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. దీంతో దేశీయంగా తొలిసారి సొంత యుద్ధనౌకల తయారీ ప్రారంభమైంది. కంపెనీ డెక్‌ మెషీనరీ ఉత్పత్తులు, పోర్టబుల్‌ స్టీల్‌ బ్రిడ్జీలు, మెరైన్‌ పంపులు తదితరాలను సైతం రూపొందిస్తోంది. కోల్‌కతాలో మొత్తం మూడు షిప్‌బిల్డింగ్‌ యూనిట్లను కలిగి ఉంది.Most Popular