రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌!

రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీవోకు అనుమతించాల్సిందిగా సెబీకి మార్చి 28న ఆర్‌వీఎన్‌ఎల్‌ దరఖాస్తు చేసుకుంది. దేశీ కంపెనీలు ఐపీవో, ఎఫ్‌పీవో, రైట్స్‌ తదితర ఇష్యూలు చేపట్టేందుకు సెబీ అనుమతి తప్పనిసరన్న సంగతి తెలిసిందే. కాగా.. హైస్పీడ్‌ రైళ్ల కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే ఆర్‌వీఎన్‌ఎల్‌ ఐపీవోలో భాగంగా 10 శాతం వాటాకు సమానమైన 2.08 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా ప్రభుత్వం 10 శాతం వాటాను డిజిన్వెస్ట్‌ చేయనుంది.  Most Popular