ప్రభుత్వ చర్యలు హర్షణీయం : ఫిక్కీ

ప్రభుత్వ చర్యలు హర్షణీయం : ఫిక్కీ

హైదరాబాద్‌ను అభివృద్ధి పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు హర్షణీయమని, తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తామని ఫిక్కీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐసీసీఐ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పట్టణీకరణ- ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ ఫిక్కీ డైరెక్టర్ విజయ్‌సారథి, టీఎస్‌ఐఐసీ ఎండీ వీ నర్సింహారెడ్డి, ఎఇకామ్ ఇండియా ప్రతినిధి మన్మోహన్‌సింగ్ రావత్, అడాప్ట్ ఎండీ మహీప్‌తపార్, భాగ్యనగర్ ఇండియా సంస్థ ఎండీ దేవేందర్ సురానా, రాంకీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.Most Popular