వాటా కొనుగోలుతో లాభాల గేట్‌వే?!

వాటా కొనుగోలుతో లాభాల గేట్‌వే?!

గేట్‌వే రైల్‌ ఫ్రైట్‌లో బ్లాక్‌స్టోన్‌కున్న మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో లాజిస్టిక్స్‌ దిగ్గజం గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 33 ఎగసి రూ. 199 వద్ద ఫ్రీజయ్యింది. 
రూ. 810 కోట్లు
అనుబంధ సంస్థ గేట్‌వే రైట్‌ ఫ్రైట్‌లో పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌కున్న కచ్చితంగా మార్పిడి చేసుకోవలసిన ప్రిఫరెన్స్‌ షేర్లతోపాటు.. ఈక్విటీ షేర్ల కొనుగోలుకి బోర్డు అంగీకరించినట్లు గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ పేర్కొంది. ఇందుకు రూ. 810 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో గేట్‌వే రైల్‌లో గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ వాటా 99.8 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది.Most Popular