శ్రేయాస్‌ షిప్పింగ్‌కు క్యూ4 పుష్‌!

శ్రేయాస్‌ షిప్పింగ్‌కు క్యూ4 పుష్‌!

గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో శ్రేయాస్‌ షిప్పింగ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 545 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 615 వరకూ ఎగసింది. 
ఫలితాలు గుడ్‌
క్యూ4(జనవరి-మార్చి)లో శ్రేయాస్‌ షిప్పింగ్‌ రూ. 23 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2016-17) క్యూ4లో రూ. 13 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 65 శాతం పెరిగి రూ. 158 కోట్లను అధిగమించింది. Most Popular