యునైటెడ్‌ బ్రూవరీస్‌- క్యూ4 స్ట్రాంగ్‌!

యునైటెడ్‌ బ్రూవరీస్‌- క్యూ4 స్ట్రాంగ్‌!

లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌  బ్రూవరీస్‌ గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 1222 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1270 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!
క్యూ4 భేష్‌
క్యూ4(జనవరి-మార్చి)లో యునైటెడ్‌ బ్రూవరీస్‌ నికర లాభం రూ. 7 కోట్ల నుంచి రూ. 91 కోట్లకు జంప్‌ చేసింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం పెరిగి రూ. 3270 కోట్లను తాకింది. Most Popular