మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ జోష్‌!

మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ జోష్‌!

ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించగా.. ప్రస్తుతం 156 పాయింట్లు పెరిగి 34,819 వద్ద కదులుతోంది. నిఫ్టీ సైతం 50 పాయింట్లు ఎగసి 10,564 వద్ద ట్రేడవుతోంది. దీంతో రెండు రోజుల తరువాత మళ్లీ చిన్న షేర్లకూ డిమాండ్‌ ఊపందుకుంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు 1 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ 0.6 శాతం బలపడింది.
జోరుగా...
బీఎస్‌ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1345 లాభపడగా.. 919 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో క్యాస్ట్రాల్‌, జీఎస్‌కే కన్జూమర్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, యూబీఎల్‌, ఎంఫసిస్‌, ఎక్సైడ్‌, టొరంట్‌ పవర్‌, ఎన్‌బీసీసీ, సెయిల్‌, టాటా కెమ్‌, నాల్కో 6-2.5 శాతం మధ్య ఎగశాయి. స్మాల్‌ క్యాప్స్‌లోనూ సుదర్శన్‌ కెమ్‌, ప్లాస్టిబ్లెండ్స్‌, గేట్‌వే, ఎంసీఎక్స్‌, జేకుమార్‌, ఆర్షియా, షాలిమార్‌, జైన్‌ ఇరిగేషన్, స్నోమ్యాన్‌, నిట్కో, శర్దా, మంగళూర్‌ కెమ్‌, ఐఎఫ్‌సీఐ, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ తదితరాలు 13-5 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular