ఐఎఫ్‌సీఐకు నిధుల జోష్‌!

ఐఎఫ్‌సీఐకు నిధుల జోష్‌!

నష్టాలు, రుణ భారంతో కుదేలైన భూషణ్‌ స్టీల్‌కు ఇచ్చిన రుణాల వసూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో ఐఎఫ్‌సీఐ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐఎఫ్‌సీఐ లిమిటెడ్ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 18 వద్ద ట్రేడవుతోంది. భూషణ్‌ స్టీల్‌ను టాటా గ్రూప్‌ దిగ్గజం టాటా స్టీల్‌ కొనుగోలు చేయడంతో రుణ చెల్లింపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. భూషణ్‌ స్టీల్‌కు ఇచ్చిన రుణాలలో భాగంగా ఐఎఫ్‌సీఐ తాజాగా రూ. 280 కోట్లను రికవర్‌ చేసుకున్నట్లు వెలువడ్డ వార్తలు ఈ కౌంటర్‌కు బూస్ట్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular