మిశ్రమంగా ఆసియా మార్కెట్లు!

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు!

జూన్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌తో సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. దీనికితోడు విదేశీ ఆటో దిగుమతులు దేశీ పరిశ్రమను దెబ్బతీస్తున్నాయా అనే అంశంపై దర్యాప్తునకు ఆదేశించడంతో చైనాతో వాణిజ్య వివాద పరిష్కారం అనిశ్చితిలో పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది.  
మిశ్రమ ధోరణి
ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, కొరియా, చైనా, ఇండోనేసియా 0.3-0.1 శాతం మధ్య నీరసించాయి. మిగిలిన మార్కెట్లలో తైవాన్‌, జపాన్‌ మాత్రమే అదికూడా నామమాత్ర లాభాలతో కదులుతున్నాయి.. కాగా.. డాలరుతో మారకంలో జపనీస్‌ యెన్‌ 2 శాతం క్షీణించి 109.31ను తాకింది. ఇటీవల నాలుగు నెలల గరిష్టం 111.39కు చేరిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు యూరో ఆరు నెలల కనిష్టం 1.16ను తాకి 1.17 వద్ద ట్రేడవుతోంది.Most Popular