విద్యార్థుల కోసం హెచ్‌పీ ‘బ్యాక్ టు కాలేజ్’ 

విద్యార్థుల కోసం హెచ్‌పీ ‘బ్యాక్ టు కాలేజ్’ 

కంప్యూటర్ కొనుక్కోవాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది విద్యార్థులు తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు.  ఇటువంటి వారికోసం టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ ఇండియా ‘బ్యాక్ టు కాలేజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ను ఎటువంటి వడ్డీ లేకుండా సులభ వాయిదాల్లో కొనుక్కోవచ్చు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేదు. 6, 9, 12 నెలల వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించొచ్చు. సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.11,998 వరకు ప్రయోజనాలనూ అందుకోవచ్చని హెచ్‌పీ ఇండియా కంజ్యూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. Most Popular