ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మా జూమ్‌-సెన్సెక్స్‌ ట్రిపుల్‌!

ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మా జూమ్‌-సెన్సెక్స్‌ ట్రిపుల్‌!

మిడ్‌ సెషన్‌ నుంచీ ఊపందుకున్న కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. చివర్లో ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి చూపడంతో ఒక దశలో 395 పాయింట్లు ఎగసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 318 పాయింట్లు పెరిగి 34,663 వద్ద నిలిచింది. ఈ బాటలో సెంచరీ సాధించిన నిఫ్టీ సైతం చివరికి 83 పాయింట్ల లాభంతో 10,514 వద్ద స్థిరపడింది. 
ఆటో వెనకడుగు
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ అత్యధికంగా 2.4 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, బ్యాంకింగ్‌, మెటల్‌ 2-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే ఆటో 1.4 శాతం వెనకడుగు వేయగా.. రియల్టీ 0.5 శాతం క్షీణించింది. కాగా.. చిన్న షేర్లు అటూఇటుగా ట్రేడయ్యాయి. బీఎస్ఈలో 1350 షేర్లు డీలాపడితే.. 1288 లాభపడ్డాయి.
నిఫ్టీ దిగ్గజాలలో 
బ్లూచిప్స్‌లో ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, హిందాల్కో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే టాటా మోటార్స్‌ 6.4 శాతం పతనంకాగా.. గెయిల్‌, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌, మారుతీ, అదానీ పోర్ట్స్‌ 5.5-1 శాతం మధ్య పతనమయ్యాయి.
డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 311 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 790 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గత రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 2146 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2687 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.Most Popular