ఫలితాలతో హీడెల్‌బర్గ్‌ సిమెంట్‌ ఖుషీ

ఫలితాలతో హీడెల్‌బర్గ్‌ సిమెంట్‌ ఖుషీ

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హీడెల్‌బర్గ్‌ సిమెంట్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 148 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 151 వరకూ ఎగసింది.
40 శాతం అప్‌
క్యూ4(జనవరి-మార్చి)లో హీడెల్‌బర్గ్‌ సిమెంట్‌ నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 52 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పెరిగి రూ. 531 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం 51 శాతం ఎగసి రూ. 120 కోట్లను తాకింది.Most Popular