అశోకా బిల్డ్‌కాన్‌కు ఆర్బిట్రల్‌ అవార్డ్‌!

అశోకా బిల్డ్‌కాన్‌కు ఆర్బిట్రల్‌ అవార్డ్‌!

పూర్తి అనుబంధ సంస్థ అశోకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్బిట్రల్‌ అవార్డును పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల సంస్థ అశోకా బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 257 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 259 వరకూ ఎగసింది. 
రూ. 384 కోట్లు
మహారాష్ట్రలోని పుణే- షిరూర్‌ రోడ్ ప్రాజెక్టును పూర్తిచేసిన అశోకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దాదాపు రూ. 384 కోట్లను ఆర్బిట్రల్‌ అవార్డుకింద అందుకున్నట్లు అశోకా బిల్డ్‌కాన్‌ తెలియజేసింది. పీడబ్ల్యూడీ విభాగం నుంచి లభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు లైన్ల పుణే- అహ్మద్‌నగర్‌ రోడ్డును అభివృద్ధి చేసినట్లు తెలియజేసింది.Most Popular