క్యూ4 ఎఫెక్ట్‌- ఎన్‌సీసీ దూకుడు 

క్యూ4 ఎఫెక్ట్‌- ఎన్‌సీసీ దూకుడు 

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మౌలిక సదుపాయాల హైదరాబాద్‌ సంస్థ ఎన్‌సీసీ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 8.5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 115 వరకూ ఎగసింది.
61 శాతం అప్‌
క్యూ4(జనవరి-మార్చి)లో ఎన్‌సీసీ లిమిటెడ్ నికర లాభం 61 శాతం జంప్‌చేసి రూ. 103 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 2,418 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 1 డివిడెండ్‌ను ప్రకటించింది.



Most Popular