ఐటీ, ఫార్మా జోరు- ఆటో రివర్స్‌ గేర్‌!

ఐటీ, ఫార్మా జోరు- ఆటో రివర్స్‌ గేర్‌!

ప్రపంచ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 186 పాయింట్లు ఎగసి 34,531ను తాకగా.. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 10,473 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 2.2 శాతం జంప్‌చేయగా, ఫార్మా 1.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. అయితే ఆటో 1.8 శాతం, రియల్టీ 1 శాతం చొప్పున నష్టపోయాయి.
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌సీసీ 7.5 శాతం జంప్‌చేయగా.. కేపీఐటీ, కావేరీ సీడ్‌, ఆర్‌ఈసీ, బెర్జర్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, పీఎఫ్‌సీ, టీసీఎస్‌, జస్ట్‌డయల్‌, ఎయిర్‌టెల్‌ 5.4-2.8 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క ఆయిల్‌ ఇండియా 10 శాతం కుప్పకూలగా, ఓఎన్‌జీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, టాటా మోటార్స్‌, మదర్‌సన్‌, అదానీ పవర్‌, దాల్మియా భారత్‌, పీసీ జ్యువెలర్స్‌, ఐజీఎల్‌ 8-5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular