రెండో రోజూ మదర్‌సన్‌ సుమీ బోర్లా!

రెండో రోజూ మదర్‌సన్‌ సుమీ బోర్లా!

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోకపోవడంతో ఆటో విడిభాగాల దిగ్గజం మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌ కౌంటర్‌లో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 4.2 శాతం పతనమై రూ. 306 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 303 వరకూ క్షీణించింది. బుధవారం సైతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 309 వద్ద స్థిరపడింది.
9 శాతం అప్‌
క్యూ4(జనవరి-మార్చి)లో మదర్‌సన్‌ సుమీ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 518 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 37 శాతం ఎగసి రూ. 15,408 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 18 శాతం పుంజుకుని రూ. 1419 కోట్లయ్యింది. ఇతర ఆదాయం మాత్రం రూ. 125 కోట్ల నుంచి రూ. 61 కోట్లకు తగ్గింది. ఇబిటా మార్జిన్లు 10.7 శాతం నుంచి 9.2 శాతానికి బలహీనపడ్డాయి.Most Popular