ఐటీ, ఫార్మా, బ్యాంక్స్‌ దన్ను- సెన్సెక్స్‌ డబుల్‌!

ఐటీ, ఫార్మా, బ్యాంక్స్‌ దన్ను- సెన్సెక్స్‌ డబుల్‌!

ప్రపంచ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ సాధించింది.  ప్రస్తుతం 210 పాయింట్లు పెరిగి 34,555ను అధిగమించగా.. నిఫ్టీ నిఫ్టీ 55 పాయింట్లు బలపడి 10,485 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా రంగాలు 2 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఆటో 1.35 శాతం, రియల్టీ 0.5 శాతం చొప్పున క్షీణించాయి.
నిఫ్టీ దిగ్గజాలలో 
బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐవోసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్ఎం 3.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోపక్క టాటా మోటార్స్‌ 7 శాతం పతనంకాగా.. ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, వేదాంతా, హెచ్‌పీసీఎల్‌, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఆటో, గెయిల్‌ 3.5-1 శాతం మధ్య నీరసించాయి.Most Popular