క్యూ4- రూపా అండ్‌ కంపెనీ భల్లేభల్లే!

క్యూ4- రూపా అండ్‌ కంపెనీ భల్లేభల్లే!

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇన్నర్‌ గార్మెంట్స్‌ తయారీ సంస్థ రూపా అండ్‌ కంపెనీ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం పెరిగి రూ. 446 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 468 వరకూ ఎగసింది.
70 శాతం అప్‌!
క్యూ4(జనవరి-మార్చి)లో రూపా అండ్‌ కంపెనీ నికర లాభం 70 శాతం జంప్‌చేసి రూ. 40 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం ఎగసి రూ. 421 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 3 డివిడెండ్‌ను ప్రకటించింది.  



Most Popular