క్యూ4- ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కళకళ!

క్యూ4- ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కళకళ!

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 1660 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1665 వరకూ ఎగసింది.
14 శాతం అప్‌!
క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 189 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 22  శాతం ఎగసి రూ. 2118 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ నికర లాభం మరింత అధికంగా 31 శాతం దూసుకెళ్లి రూ. 321 కోట్లను తాకింది.



Most Popular