175 పాయింట్లు ప్లస్‌- ఐటీ, ఫార్మా పుష్‌!

175 పాయింట్లు ప్లస్‌- ఐటీ, ఫార్మా పుష్‌!

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 174 పాయింట్లు పెరిగి 34,519ను తాకగా.. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 10,467 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 1.7 శాతం జంప్‌చేయగా.. ఫార్మా 1.35 శాతం ఎగసింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌ సైతం 1 శాతం పుంజుకోగా... అయితే ఆటో 1.35 శాతం, రియల్టీ 1 శాతం చొప్పున క్షీణించాయి.
ఎఫ్‌అండ్‌వో తీరిదీ
డెరివేటివ్‌ కౌంటర్లలో కావేరీ సీడఢ్‌ 7.5 శాతం జంప్‌చేయగా.. జేపీ, జస్ట్‌డయల్‌, సన్‌ ఫార్మా, కేడిలా హెల్త్‌, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, కేపీఐటీ, వొకార్డ్‌, టీసీఎస్‌ 4.4-2.2 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క జెట్‌ ఎయిర్‌వేస్‌ 8 శాతం కుప్పకూలగా.. టాటా మోటార్స్‌ 7 శాతం పతనమైంది. మిగిలిన కౌంటర్లలో జైన్‌ ఇరిగేషన్‌, పీసీ జ్యువెలర్స్‌, అదానీ పవర్‌, భారత్‌ ఫోర్జ్‌, మదర్‌సన్‌, దాల్మియా భారత్‌, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ 5-4 శాతం మధ్య పతనమయ్యాయి.`



Most Popular