అటూఇటుగా ఆసియా-ఇండొనేసియా హైజంప్‌!

అటూఇటుగా ఆసియా-ఇండొనేసియా హైజంప్‌!

వడ్డీ రేట్ల పెంపును వేగవంతంగా చేపట్టబోమంటూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అధికారులు అభిప్రాయపడిన నేపథ్యంలో ఆసియాలో స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. రేట్ల పెంపునకు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే పరిగణించలేమని, ఉపాధి మార్కెట్‌ సైతం ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదని ఫెడ్‌ సభ్యలు అభిప్రాయపడినట్లు మినిట్స్‌ ద్వారా వెల్లడైంది. మరోవైపు  చైనాతో వాణిజ్య వివాద పరిష్కారానికి విభిన్న మార్గదర్శకాలు అవసరమని అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగియగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. 
మిశ్రమ ధోరణి
ఆసియా మార్కెట్లలో జపాన్‌ 1.4 శాతం పతనంకాగా.. ఇండోనేసియా 2.4 శాతం జంప్‌చేసింది. మిగిలిన మార్కెట్లలో థాయ్‌లాండ్‌ 0.9 శాతం, కొరియా 0.3 శాతం చొప్పున క్షీణించగా.. చైనా నామమాత్ర నష్టంతో కదులుతోంది. తైవాన్‌, సింగపూర్‌ 0.4 శాతం పుంజుకోగా.. హాంకాంగ్‌, నామమాత్రంగా బలపడి ట్రేడవుతోంది. కాగా.. తాజా పాలసీ సమీక్షలో వరుసగా ఆరో నెలలోనూ దక్షిణ కొరియా వడ్డీ రేట్లను 1.5 శాతం వద్ద నిలకడగా కొనసాగించేందుకు నిర్ణయించింది.Most Popular