క్యూ4-ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ లాభాల షో!

క్యూ4-ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ లాభాల షో!

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో మీడియా రంగ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 15 శాతం దూసుకెళ్లి రూ. 136 వద్ద ట్రేడవుతోంది. 
79 శాతం అప్‌!
క్యూ4(జనవరి-మార్చి)లో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా నికర లాభం 79 శాతం జంప్‌చేసి రూ. 61 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 32  శాతం పెరిగి రూ. 239 కోట్లకు చేరింది. ఇబిటా 129 శాతం దూసుకెళ్లి రూ. 90 కోట్లను అధిగమించింది. Most Popular