బ్లాక్‌డీల్స్‌తో కావేరీ సీడ్‌ జూమ్‌

బ్లాక్‌డీల్స్‌తో కావేరీ సీడ్‌ జూమ్‌

బ్లాక్‌డీల్స్‌ నమోదైన నేపథ్యంలో కావేరీ సీడ్‌ కంపెనీ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 496 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 503 వరకూ ఎగసింది. హైబ్రిడ్‌ సీడ్‌ తయారీ హైదరాబాద్‌ సంస్థ కావేరీ సీడ్‌ కౌంటర్లో బుధవారం బ్లాక్‌డీల్స్‌ జరిగాయి. పబ్రాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌-2 1.2 శాతం వాటాకు సమానమైన 7.79 లక్షల కావేరీ సీడ్‌ షేర్లను కొనుగోలు చేసింది. బీఎన్‌పీ పరిబాస్‌ ఆర్బిట్రేజ్‌ 1.1 శాతం వాటాకు సమానమైన 7.42 లక్షల షేర్లను విక్రయించింది. డీల్‌ రూ. 488 సగటు ధరలో జరిగినట్లు తెలుస్తోంది.Most Popular