లాభాల్లో మార్కెట్లు- ఐటీ అప్‌- ఆటో డౌన్‌!

లాభాల్లో మార్కెట్లు- ఐటీ అప్‌- ఆటో డౌన్‌!

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 126 పాయింట్లు పెరిగి 34,474ను తాకగా.. నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 10,454 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 1.6 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ దాదాపు 1 శాతం చొప్పున ఎగశాయి. అయితే ఆటో 1.3 శాతం, రియల్టీ 1 శాతం చొప్పున క్షీణించాయి.
టాటా మోటార్స్‌ డౌన్
నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా,  యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ 2.4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. మరోపక్క టాటా మోటార్స్‌ 6 శాతం పతనంకాగా.. గ్రాసిమ్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, వేదాంతా, ఐబీ హౌసింగ్‌, అల్ట్రాటెక్‌, అదానీ పోర్ట్స్‌ 4-1.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి.



Most Popular