క్యూ4- టాటా మోటార్స్‌ రివర్స్‌ గేర్‌!

క్యూ4- టాటా మోటార్స్‌ రివర్స్‌ గేర్‌!

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు రూ. 284 వరకూ పతనమై 52 వారాల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం దాదాపు 6 శాతం తిరోగమించి రూ. 292 దిగువన ట్రేడవుతోంది. దీంతో గత రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది.  
50 శాతం డౌన్‌!
క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన టాటా మోటార్స్‌ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 2175 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ. 91,279 కోట్లను తాకింది. ఇబిటా 4 శాతం పుంజుకుని 11,250 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర నష్టం రూ. 806 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గింది. రూ. 963 కోట్లమేర వన్‌టైమ్‌ నష్టం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా..  లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ నిర్వహణ లాభం 46 శాతం వెనకడుగుతో 36.4 కోట్ల పౌండ్లను తాకింది. Most Popular