ఫెడ్‌ మినిట్స్‌- అమెరికా మార్కెట్లు ఓకే!

ఫెడ్‌ మినిట్స్‌- అమెరికా మార్కెట్లు ఓకే!

ద్రవ్యోల్బణం ఆధారంగా వడ్డీ రేట్ల పెంపునకు త్వరపడబోమని ఫెడరల్‌ రిజర్వ్‌ అధికారులు గత పాలసీ సమీక్ష సందర్భంగా అభిప్రాయపడినట్లు మినిట్స్‌ ద్వారా తాజాగా వెల్లడైంది. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి  వృద్ధి సాధిస్తే వడ్డీ రేట్ల పెంపునకు వీలుంటుందని ఫెడ్‌ సభ్యులు పేర్కొన్నారు. కాగా.. ఉపాధి మార్కెట్ ఆశించిన స్థాయిలో వేగమందుకోలేదని ఫెడ్‌ పేర్కొంది. దీంతో వడ్డీ రేట్ల పెంపును నెమ్మదిగా చేపట్టే అవకాశమున్నట్లు సంకేతమిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం డోజోన్స్‌ 52 పాయింట్లు(0.2 శాతం) బలపడి 24,887 వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 9 పాయింట్లు(0.3 శాతం) పెరిగి 2,733 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ మరింత అధికంగా 47 పాయింట్ల(0.65 శాతం) పుంజుకుని 7,426 వద్ద స్థిరపడింది. 
టార్గెట్‌ నేలచూపు
ఉత్పత్తుల ధరల్లో కోత, వేతనాల పెంపు వంటి అంశాల కారణంగా రిటైల్‌ దిగ్గజం టార్గెట్‌ ఫలితాలు విశ్లేషకులను నిరాశపరచాయి. దీంతో టార్గెట్‌ షేరు దాదాపు 6 శాతం పతనమైంది. మరోపక్క అంచనాలను మించిన ఫలితాలు, ఆశావహ గైడెన్స్‌ కారణంగా జ్యువెలరీ సంస్థ టిఫనీ 23 శాతంపైగా దూసుకెళ్లింది. ఈ బాటలో రాల్ఫ్‌ లారెన్‌ 14 శాతం జంప్‌చేసింది. ఇక హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సంస్థ లోవ్స్‌ 10 శాతం ఎగసింది.Most Popular