బోనస్‌ ఇష్యూ - ఎంఎం ఫోర్జింగ్స్‌ షేరు కేక!

బోనస్‌ ఇష్యూ - ఎంఎం ఫోర్జింగ్స్‌ షేరు కేక!

వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదన తెరమీదకు తీసుకురావడంతో ఆటో విడిభాగాల సంస్థ ఎంఎం ఫోర్జింగ్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 11 శాతంపైగా జంప్‌చేసి రూ. 1223 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1259 వరకూ జంప్‌చేసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!
28న సమావేశం
వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ అంశాన్ని చర్చించడంతోపాటు.. గత ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4 ఫలితాలు విడుదల చేసేందుకు ఈ నెల 28న(సోమవారం) బోర్డు సమావేశంకానున్నట్లు ఎంఎం ఫోర్జింగ్స్‌ పేర్కొంది. Most Popular