పతనబాటలో యూరప్‌ మార్కెట్లు!

పతనబాటలో యూరప్‌ మార్కెట్లు!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలకు తెరపడకపోవడంతో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. ప్రస్తుతం జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 1.3 శాతం స్థాయిలో పతనంకాగా.. యూకే ఇండెక్స్‌ ఫుట్సీ 0.65 శాతం క్షీణించింది. 
మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌ జూమ్‌
స్టీల్‌, అల్యూమినియం దిగుమతుల టారిఫ్‌ల నుంచి యూరోపియన్‌ దేశాలను మినహాయించే అంశంపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ స్పష్టతనివ్వకపోవడంతో టెనారిస్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌, ఔటొకుంపు 2 శాతం చొప్పున క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో బీఎన్‌పీ పరిబాస్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో వీర్‌ గ్రూప్‌ 3 శాతం పతనమైంది. ఫలితాలు నిరాశపరచినప్పటికీ బిజినెస్‌ పునర్వ్యవస్థీకరణ ప్రకటించిన మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌ 5 శాతం జంప్‌చేసింది. Most Popular