సెన్సెక్స్‌ 170 పాయింట్లు డౌన్‌!

సెన్సెక్స్‌ 170 పాయింట్లు డౌన్‌!

మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 170 పాయింట్లు క్షీణించి 34,481కు చేరగా.. నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 10,469 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 3 శాతం పతనంకాగా.. రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3.5 శాతం జంప్‌చేసింది. ఐటీ 0.6 శాతం పుంజుకుంది. 
డెరివేటివ్స్‌ తీరిదీ
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో బలరామ్‌పూర్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, జిందాల్‌ స్టీల్‌, సెంచురీ టెక్స్‌, వేదాంతా, మదర్‌సన్‌, సెయిల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 6.5-3.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఆంధ్రా బ్యాంక్‌, స్ట్రైడ్స్‌, కేపీఐటీ, బీవోబీ, ఐడీబీఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, పీసీ జ్యువెలర్స్‌, టాటా ఎలక్సీ, నిట్‌ టెక్‌ 7.4-2.7 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular