స్వల్ప నష్టాలతో- చిన్న షేర్లు ఓకే!

స్వల్ప నష్టాలతో- చిన్న షేర్లు ఓకే!

విదేశీ ప్రతికూలతల కారణంగా బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 30 పాయింట్లు నీరసించి 34,621కు చేరగా.. నిఫ్టీ 24 పాయింట్ల వెనకడుగుతో 10,513ను తాకింది. అయితే వరుసగా రెండో రోజు చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి.
లాభపడ్డవే ఎక్కువ
ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1342 బలపడగా.. 1052 నష్టాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌, నాట్కో ఫార్మా, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ, యూనియన్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఇమామీ, ఫ్యూచర్‌ రిటైల్‌ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో స్మాల్‌ క్యాప్స్‌లోనూ మిండా ఇండస్ట్రీస్‌, మార్క్‌సన్స్‌, ఎంఎం ఫోర్జింగ్స్‌, రుచీ సోయా, నిట్‌, మధుకాన్‌, జీసీ, స్పైస్‌జెట్‌, బాలాజీ టెలీ, సట్లెజ్‌, ఆంధ్రా బ్యాంక్‌ తదితరాలు 15-7 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular