నష్టాలలోనే మార్కెట్లు- మెటల్‌ షేర్లు బోర్లా!

నష్టాలలోనే మార్కెట్లు- మెటల్‌ షేర్లు బోర్లా!

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 70 పాయింట్లు క్షీణించి 34,581కు చేరగా.. నిఫ్టీ 39 పాయింట్లు నీరసించి 10,497ను తాకింది. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ఆశావహంగా లేవంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడగా... ప్రస్తుతం ఆసియా మార్కెట్లూ తిరోగమన పథంలో కదులుతున్నాయి. 
ఎస్‌బీఐ జోష్‌
క్యూ4 ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ దాదాపు 5 శాతం జంప్‌చేయడంతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ అత్యధికంగా 3.7 శాతం జంప్‌చేసింది. అయితే మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతం పతనమైంది. మెటల్‌ కౌంటర్లలో వేదాంతా 5.5 శాతం కుప్పకూలగా, టాటా స్టీల్‌, సెయిల్‌, నాల్కో, హిందాల్కో, హింద్‌ జింక్‌, జిందాల్‌ స్టీల్‌  3.7-1 శాతం మధ్య పతనమయ్యాయి.
బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో స్టాక్స్‌లో సిప్లా, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, ఐబీ హౌసింగ్‌, టీసీఎస్, సన్‌ ఫార్మా 3-0.65 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, జీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌ 7-2 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular