యూకే కాంట్రాక్ట్‌- బీఎల్‌ఎస్‌ హైజంప్‌!

యూకే కాంట్రాక్ట్‌- బీఎల్‌ఎస్‌ హైజంప్‌!

యూకే ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందినట్లు వెల్లడించడంతో బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 8 శాతంపైగా దూసుకెళ్లి రూ. 181 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 185 వరకూ జంప్‌చేసింది. 
డెలివరీ సర్వీసెస్‌
సోప్రా స్టెరియాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం ద్వారా యూకే వీసాలు, ఇమ్మిగ్రేషన్‌ విభాగం నుంచి డెలివరీ సర్వీసుల ప్రాజెక్ట్‌ లభించినట్లు బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా యూకేలో ఇప్పటికే వీసాలు కలిగిన వ్యక్తులకు రెన్యూవల్స్‌ విషయంలో సపోర్టింగ్‌ సేవలను నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 74.24 శాతం వాటా ఉంది.Most Popular