చమురు సెగ- పెట్రో షేర్లు పతనం!

చమురు సెగ- పెట్రో షేర్లు పతనం!

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్టాల వద్ద కొనసాగడానికితోడు డాలరుతో మారకంలో రూపాయి విలువ 68 దిగువకు పతనంకావడంతో చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లలో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. చమురు ధరలు పెరిగితే.. మార్జిన్లు క్షీణించే అవకాశముండటంతో ఇన్వెస్టర్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలకు దిగుతున్నారు. 

ఏడాది కనిష్టాలకు
చమురు శుద్ధి(రిఫైనరీ) కార్యకలాపాలు నిర్వహించే పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలు తాజాగా అమ్మకాలతో డీలాపడ్డాయి. ఎన్‌ఎస్ఈలో ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌ షేరు 6 శాతం పతనమైంది. రూ. 293 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో బీపీసీఎల్‌ సైతం 6  శాతం దిగజారి రూ. 374 దిగువకు చేరింది. ఇక ఐవోసీ 3.7 శాతం తిరోగమించి రూ. 155 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 154 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో మంగళూర్‌ రిఫైనరీ(ఎంఆర్‌పీఎల్‌) 1 శాతం నష్టంతో రూ. 99 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది కనిష్టంకాగా.. చెన్నై పెట్రోలియం 2 శాతం పతనమై రూ. 274 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 271 వద్ద ఏడాది కనిష్టానికి చేరింది.Most Popular