బ్లాక్‌డీల్స్‌- స్ట్రైడ్స్‌ షసున్‌ దూకుడు!

బ్లాక్‌డీల్స్‌- స్ట్రైడ్స్‌ షసున్‌ దూకుడు!

గతేడాది(2017-18) చివరి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో రెండు రోజులపాటు నష్టాల బాటలో సాగిన స్ట్రైడ్స్‌ షసున్‌  కౌంటర్‌కు వరుసగా రెండో రోజు భారీ డిమాండ్ పుట్టింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 434 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 440 వరకూ జంప్‌చేయడం విశేషం! మంగళవారం సైతం ఈ కౌంటర్‌ 15 శాతంపైగా దూసుకెళ్లి రూ. 392 వద్ద ముగిసిన విషయం విదితమే.
బ్లాక్‌డీల్స్‌ ఎఫెక్ట్‌
బ్లాక్‌డీల్స్‌ ద్వారా మంగళవారం బీఎన్‌పీ పరిబాస్‌ ఆర్బిట్రేజ్‌ 4.85 లక్షల స్ట్రైడ్స్‌ షసున్‌ షేర్లను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 0.5 శాతం వాటాకు సమానంకాగా.. షేరుకి రూ. 365.25 ధరలో వీటిని సొంతం చేసుకుంది. ఇదే విధంగా షేరుకి రూ. 375.27 ధరలో బ్రూక్‌డేల్‌ మారిషస్‌ ఇంటర్నేషనల్‌ 1.1 శాతం వాటాకు సమామైన 10 లక్షల స్ట్రైడ్స్‌ షసున్‌ షేర్లను కొనుగోలు చేసింది. Most Popular