స్వల్ప నష్టాలతో షురూ- ఎస్‌బీఐ జోరు!

స్వల్ప నష్టాలతో షురూ- ఎస్‌బీఐ జోరు!

ప్రతికూల విదేశీ సంకేతాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 28 పాయింట్ల వెనకడుగుతో 34,623కు చేరగా.. నిఫ్టీ 11 పాయింట్లు తక్కువగా 10,526ను తాకింది. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ఆశావహంగా లేవంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. 
ఫార్మా అప్‌- మెటల్‌ డౌన్
ఎస్‌బీఐ 3.5 శాతం జంప్‌చేయడంతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ అత్యధికంగా 3.4 శాతం జంప్‌చేసింది. ఇతర రంగాలలో ఫార్మా 1.2 శాతం పుంజుకోగా.. మెటల్‌ 1.25 శాతం తిరోగమించింది. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా 4 శాతం పతనంకాగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, ఐవోసీ, బజాజ్‌ ఫిన్‌, జీ 2-1 శాతం మధ్య నష్టపోయాయి. మరోపక్క సిప్లా 5.3 శాతం జంప్‌చేయగా, టాటా మోటార్స్‌, ఐబీ హౌసింగ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, టైటన్‌, లుపిన్‌, యస్‌బ్యాంక్‌ 1.7-0.5 శాతం మధ్య ఎగశాయి.Most Popular