యూఎస్‌ఎఫ్‌డీఏ ఓకే- గ్రాన్యూల్స్‌ జోరు!

యూఎస్‌ఎఫ్‌డీఏ ఓకే- గ్రాన్యూల్స్‌ జోరు!

మైథిలెర్గోనోవిన్‌ జనరిక్‌ ట్యాబ్లెట్లకు యూఎస్ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా తాజాగా వెల్లడించడంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 6.2 శాతం జంప్‌చేసి రూ. 103 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 104 వరకూ ఎగసింది.
జీడిమెట్ల ఏపీఐ ఎఫెక్ట్‌
హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఏపీఐ ప్లాంటులో ఇటీవల తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఎలాంటి లోపాలూలేవంటూ క్లీన్‌చిట్‌(ఈఐఆర్‌) ఇచ్చినట్లు కంపెనీ బుధవారమే స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మార్చిలో ఇదే ప్లాంటుకి ఫామ్‌ 483 జారీ అయినట్లు కంపెనీ గుర్తుచేసింది. Most Popular