ఇటలీ ఎఫెక్ట్‌-ఆసియా మార్కెట్లు మిశ్రమం!

ఇటలీ ఎఫెక్ట్‌-ఆసియా మార్కెట్లు మిశ్రమం!

ఐదు ఇటాలియన్‌ పార్టీలు ఏకంకావడం ద్వారా 250 బిలియన్‌ యూరోల రుణాల మాఫీకి యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ)పై ఒత్తిడి తీసుకురానున్నట్లు వార్తలు వెలువడటంతో యూరో 1.176 వద్ద ఐదు నెలల కనిష్టానికి చేరింది. మరోపక్క ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ 3.1 శాతాన్ని తాకాయి. దీంతో డాలరు 93.28కు బలపడింది. ఇక జపనీస్‌ యెన్‌ 110.29 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. 
అటూఇటుగా 
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. జపాన్‌, ఇండొనేసియా 0.75 శాతం చొప్పున ఎగశాయి. చైనా, తైవాన్‌ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. మిగిలిన మార్కెట్లలో థాయ్‌లాండ్‌, సింగపూర్‌ నామమాత్ర లాభాలతోనూ.. కొరియా, హాంకాంగ్ నామమాత్ర నష్టాలతోనూ ట్రేడవుతున్నాయి. Most Popular