క్యూ4 ఎఫెక్ట్-ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ స్పీడ్‌!

క్యూ4 ఎఫెక్ట్-ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ స్పీడ్‌!

గతేడాది(2017-18) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(టీసీఐ) కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7.2 శాతం జంప్‌చేసి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 300 వరకూ ఎగసింది. 
ఫలితాలు భేష్‌
క్యూ4(జనవరి-మార్చి)లో టీసీఐ నికర లాభం దాదాపు రెట్టింపునకు ఎగసి రూ. 33 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం రూ. 482 కోట్ల నుంచి రూ. 605 కోట్లకు జంప్‌ చేసింది. కోల్డ్‌ చైన్‌ యూనిట్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ పేర్కొంది. ఇదే విధంగా ఎస్‌సీఎం లాగ్‌ఫోకస్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి గ్రీన్‌సిగ్రల్ ఇచ్చినట్లు తెలియజేసింది.Most Popular